Auto-Rickshaws and E-Bikes Distribution for Women Riders -A.P

మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు మరో శుభవార్త అందించింది. ఇప్పటికే ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ, టైలరింగ్ శిక్షణను ప్రారంభించిన ప్రభుత్వం, ఇప్పుడు మహిళా రైడర్ల కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
Auto-Rickshaws and E-Bikes Distribution for Women Riders
Auto-Rickshaws and E-Bikes Distribution for Women Riders

 

రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో మహిళా రైడర్ల సేవలను ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా (మార్చి 8) మహిళా రైడర్లకు ఈ-బైక్‌లు, ఆటోలు పంపిణీ చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమంలో, మార్కాపురం ప్రాంతానికి చెందిన మహిళా రైడర్లకు 10 ఈ-బైక్‌లు, 10 ఆటోలు అందజేయనున్నారు. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు వాహనాలు పంపిణీ చేయనున్నారు. తొలిదశలో 8 ప్రధాన నగరాల్లో 1,000 వాహనాలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 400 చొప్పున మొత్తం 800 వాహనాలు, నెల్లూరు, గుంటూరు నగరాల్లో 50 చొప్పున 100 వాహనాలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతిలో 25 చొప్పున 100 వాహనాలు పంపిణీ చేయనున్నారు.

ఈ వాహనాలను ర్యాపిడో సంస్థతో ఒప్పందం చేసుకుని అద్దెకు నడిపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ర్యాపిడోతో జరిగిన ఒప్పందం ప్రకారం, మహిళా రైడర్లు మొదటి మూడు నెలల పాటు ప్లాట్‌ఫాం ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, 18 బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించనున్నారు.

ప్రభుత్వం ఎంపిక చేసిన మహిళలకు హీరో విడా-వీ2 ప్లస్ ఈ-బైక్‌ను అందించనుంది, దీని ధర రూ.1,22,935. లబ్ధిదారులు ఎటువంటి డౌన్‌పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా రుణ సదుపాయంతో ఈ వాహనాన్ని పొందవచ్చు. ఈ పథకంలో భాగంగా, ప్రభుత్వం ప్రారంభించిన ‘శక్తి’ యాప్‌ను ఈ వాహనాలకు అనుసంధానం చేయనుంది. అదనంగా, లబ్ధిదారులు నెలకు రూ.500 చొప్పున 10 నెలల పాటు ర్యాపిడో సంస్థకు చెల్లించేందుకు ఆర్థిక సహాయం అందించనుంది.

.  The YSR Kalyanamasthu / Shadi Thofa Scheme Registration and Apply Process-2023

ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, భద్రతతో కూడిన ప్రయాణ సేవలను అందించగలుగుతారని ప్రభుత్వం నమ్మక వ్యక్తం చేసింది.

Auto-Rickshaws and E-Bikes Distribution for Women Riders

The Andhra Pradesh government has announced good news for women on the occasion of Women’s Day. Earlier, the government started giving free sewing machines and tailoring training. Now, it is introducing a new program to support women riders. Auto-Rickshaws and E-Bikes Distribution for Women Riders.

As part of this program, the government will provide e-bikes and auto-rickshaws to women riders on Women’s Day (March 8). Chief Minister Chandrababu Naidu will launch this program in a meeting at Markapur, Prakasam district.

In this event, 10 e-bikes and 10 auto-rickshaws will be given to women riders from Markapur. Also, selected members of women’s self-help groups in different districts will receive vehicles. In the first phase, the government plans to provide 1,000 vehicles in 8 major cities. Visakhapatnam and Vijayawada will get 400 vehicles each, Nellore and Guntur will receive 50 each, and Kakinada, Rajahmundry, Kurnool, and Tirupati will receive 25 each.

The government has partnered with Rapido to help women riders rent and operate these vehicles. For the first three months, they will not have to pay platform fees to Rapido. The government is also helping them get loans from 18 banks.

.  Pradhan Mantri Ujjwala Yojana 2.0 Free Gas Connection 2023

Women selected for this scheme will receive the Hero Vida V2 Plus e-bike, which costs ₹1,22,935. They do not have to pay any down payment, as the entire cost will be covered through loans. The government will also link these vehicles with the Shakti app. To further support women, it will provide financial help so that they can pay ₹500 per month for 10 months to Rapido.

This scheme aims to provide better job opportunities for women and improve their safety while traveling.

Leave a Comment