Educational Loans for Higher Studies | Loans for Overseas Education

Educational Loans for Higher Studies Parents dream of seeing their children enroll in their desired courses at prestigious institutions and achieve great heights. However, the high fees often prevent them from doing so. Despite their talent, many students miss out on admissions because they cannot afford fees running into lakhs of rupees. Banks’ educational loans are stepping in to support these students. The admission process for courses like engineering for the 2024-25 academic year has already begun.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Currently, the annual fees for popular state-level colleges under the convener quota range from Rs. 60,000 to over Rs. 1 lakh. On a national level, prominent institutions like IITs charge up to Rs. 1 lakh per semester for M.Tech, while NITs charge between Rs. 65,000 to Rs. 70,000 per semester. For management education, top B-schools like IIMs charge more than Rs. 20 lakhs for an MBA program. Even traditional degree courses at reputed colleges can cost up to Rs. 50,000. For overseas education, the average annual expenditure can go up to Rs. 50 lakhs. Banks are aiding students who struggle to pay these hefty fees by providing educational loans to support their higher education.

Educational Loans for Higher Studies

Eligibility Criteria

Banks grant educational loans to students who have passed the entrance test and secured a seat in the convener quota. Public sector banks prioritize merit in entrance exams for loan approval, while several private banks also allow students admitted under the management quota to apply for educational loans. Banks sanction loans according to their internal policies.

Recognized Institutions

Banks follow specific guidelines for granting educational loans. They consider only those colleges and courses recognized by AICTE, UGC, and the Department of Education. Students admitted to recognized institutions and courses are eligible to apply for educational loans.

Loans for Overseas Education

Candidates aspiring for overseas education can also avail of educational loans. Students admitted to domestic institutions can get loans up to Rs. 10 lakhs, while those gaining admission to foreign institutions can get up to Rs. 20 lakhs.

.  Student Loans for Community College Students

Three Loan Slabs

Banks implement a three-slab system for granting educational loans:

1. Slab 1: Loans up to Rs. 4 lakhs require no collateral.
2. Slab 2: Loans between Rs. 4 lakhs and Rs. 7.5 lakhs require a guarantee from parents and a third-party guarantor.
3. Slab 3: Loans above Rs. 7.5 lakhs require collateral security equivalent to the loan amount.

Margin Money Requirements

Students need to provide a portion of the loan amount as margin money. Loans up to Rs. 4 lakhs do not require margin money. For loans exceeding Rs. 4 lakhs, students studying domestically need to provide 5% margin money, while those studying abroad need to provide 15%.

Loan Coverage

Educational loans cover course tuition fees, hostel fees, examination/library/laboratory fees, travel expenses for overseas education, books, uniforms, academic equipment, computer purchases, study tours, project work, and refundable deposits like caution deposits and building funds.

Exemptions for Prestigious Institutions

According to the Indian Banks’ Association guidelines, while there are specific rules for the maximum loan amount, banks have the discretion to increase the loan limit for students admitted to prestigious institutions. For example, institutions like IIMs and IITs have fees exceeding Rs. 10 lakhs, and students admitted to such institutions may receive exemptions regarding the maximum loan limit.

Continuous Review

Banks that sanction educational loans make payments directly to the respective institutions in installments. If students have already paid the initial fees, banks reimburse them based on the relevant receipts. Subsequent payments are made directly to the institutions. Banks review the student’s academic performance before deciding on further loan disbursements.

Repayment Holiday Educational Loans for Higher Studies

Banks provide a repayment holiday for educational loans. Repayment can start a year after completing the course or upon securing a job, whichever is earlier. The loan can be repaid through EMIs over a maximum period of 15 years. Female students receive an interest rate concession of 0.5% to 1%.

Complete Awareness is Necessary

Students aspiring to pursue higher education through educational loans must take several precautions. They should understand the rules and interest rates of the respective banks clearly and be aware of the repayment methods. They should also verify that the institute they are admitted to is recognized by AICTE, UGC, or other regulatory bodies.

Documents Required for Application

The documents required for applying for an educational loan include the admission confirmation letter from the educational institution, Xerox copies of academic qualification certificates, parents’ income certificates, parents’ income status details, bank account statements, residence proof, third-party income verification, and authorized letters from the institution regarding the course expenses.

.  Sallie Mae International Student Loans

For More Information

Contact the managers of public and private sector banks for further details.

Vidya Lakshmi Portal

To simplify the process for students applying for educational loans, the central government has implemented a single-window system called the Vidya Lakshmi Portal. Students can log into this portal and apply online through the Common Educational Loan Application Form. They can apply to a maximum of three banks. The respective banks will review the applications, and if satisfied, they will inform the students which branch to contact and what documents to bring. The Vidya Lakshmi Portal serves as a liaison between students and banks regarding educational loans.

ఉన్నత విద్యకు … విద్యా రుణాలు

మన పిల్లలు నచ్చిన కోర్సులో, మెచ్చిన విద్యాలయాల చేరి.. , ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశించే వారు!  భారీ ఫీజుల కారణంగా కోరుకున్న కోర్సులో తల్లిదండ్రులు చేర్చలేకపోతున్నారు .
మన పిల్లలకు ప్రతిభ ఉన్నా.. రూ.లక్షల్లో ఫీజులు కట్టలేక అడ్మిషన్‌ వదులుకుంటున్నారు. ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నాయి బ్యాంకుల ఎడ్యుకేషన్‌ లోన్స్‌! 2024–25 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల లో  ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనాయి .
  • ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రముఖ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో చేరాలంటే.. ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.లక్షన్నరకుపైగా ఫీజు ఉంది.
  • జాతీయ స్థాయిలో ప్రముఖ విద్యాలయాలు ఐఐటీలో ఎంటెక్  సెమిస్టర్‌కు రూ.లక్ష వరకు; ఎన్‌ఐటీ లో సెమిస్టర్‌కు రూ.65 వేల నుంచి రూ.70 వేలు వరకు ఫీజు వసూలు చేస్తున్నారు.
  • మేనేజ్‌మెంట్‌ విద్యకు సంబంధించి దేశంలోని ప్రముఖ బీస్కూల్స్‌ ఐఐఎం లలో ఎంబీఏ ప్రోగ్రామ్‌ కు రూ.20 లక్షలకు పైగానే ఫీజు ఉంది.
  • సంప్రదాయ డిగ్రీ కోర్సులకు కూడా పేరున్న కాలేజీలో రూ.50 వేల వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోంది.
  • విదేశీ విద్యకు సగటున ఏడాదికి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతోంది.  లక్షల్లో ఉన్న ఫీజులు చెల్లించలేక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు బ్యాంకులు చేయూతనందిస్తున్నాయి. విద్యారుణాలు మంజూరు చేస్తూ వారి ఉన్నత విద్యకు సహకరిస్తున్నాయి.

అర్హతలు ఏమిటి

ఎంట్రన్స్‌ టెస్టులో ఉత్తీర్ణత సాధించి కన్వీనర్‌ కోటాలో సీటు పొందిన విద్యార్థులకే  విద్యా రుణ దరఖాస్తుకు బ్యాంకులు అర్హత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు ఎంట్రన్స్‌లో మెరిట్‌ పొందిన వారికే విద్యా రుణ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నాయి. పలు ప్రైవేట్‌ బ్యాంకులు మాత్రం మేనేజ్‌మెంట్‌ కోటాలో ప్రవేశం పొందిన వారికి కూడా విద్యా రుణ దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఆయా బ్యాంకులు తమ అంతర్గత విధి విధానాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి.

గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి

విద్యా రుణాలను మంజూరుకు బ్యాంకులు నిర్ది­ష్ట నిబంధనలను అనుసరిస్తున్నాయి. ఏఐసీటీఈ, యూజీసీ, విద్యాశాఖ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటున్నాయి. గుర్తింపున్న ఇన్‌స్టిట్యూట్‌లలో, కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యా రుణం కోసం దరఖాస్తుకు అర్హత కల్పిస్తున్నాయి.

విదేశీ విద్యకు సైతం రుణా సదుపాయం

విదేశీ విద్య అభ్యర్థులు కూడా విద్యారుణాలు పొందే అవకాశం ఉంది. దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షల వరకూ రణం లభిస్తోంది. అదేవిధంగా విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్‌ లభించిన వారికి గరిష్టంగా రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నారు.

మూడు శ్లాబ్‌లు

ఎడ్యుకేషన్‌ లోన్స్‌ మంజూరుకు బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానాన్ని అమలు చేస్తున్నాయి.
  1.     శ్లాబ్‌–1లో.. రూ.4 లక్షల రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో రుణ మంజూరుకు విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు.
  2.     శ్లాబ్‌–2లో.. రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్‌ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
  3.     శ్లాబ్‌–3లో.. రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం ఉంటోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్‌ సెక్యూరిటీ (స్తిరాస్థి పత్రాలను) చూపాల్సి ఉంటుంది.

మార్జిన్‌ మనీ ఎంత అవసరం

విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్‌ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్‌ మనీ అవసరం లేదు. కాని రూ.4 లక్షలు దాటితే మాత్రం స్వదేశంలో చదివే విద్యార్థులు అయిదు శాతం, విదేశీ విద్య విద్యార్థులు 15 శాతం మార్జిన్‌ మనీ ని సమకూర్చుకోవాలి.

బ్యాంకుల రుణం.. ఈ ఖర్చులకు మాత్రమే

కోర్సు ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు, ఎగ్జామినేషన్‌/లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు, విదేశీ విద్య ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్‌ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు, కంప్యూటర్‌ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్‌ వర్క్స్, ఇన్‌స్టిట్యూట్‌లు వసూలు చేసే కాషన్‌ డిపాజిట్, బిల్డింగ్‌ ఫండ్, రిఫండబుల్‌ డిపాజిట్‌లకు సంబంధించిన వ్యయాలకు విద్యా రుణాలు మంజూరు చేస్తున్నారు.

అంతర్జాతీయ, దేశీయ ప్రసిద్ధ విద్యాసంస్థలకు* మినహాయింపు

ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ నిబంధనల ప్రకారం–గరిష్ట రుణ మొత్తం మంజూరులో నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ.. విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ లలో ప్రవేశం పొందితే గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికారం బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐఎంలు, ఐఐటీల వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో రూ.పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణం విషయంలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది.

నిరంతర సమీక్ష నిర్వహిస్తారు

విద్యా రుణం మంజూరు చేసిన బ్యాంకులు.. వాటిని విడతల వారీగా ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌కు నేరుగా చెల్లిస్తాయి. తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించి ఉంటే.. సంబంధిత రశీదుల ఆధారంగా తొలిదశ ఫీజును విద్యార్థికి అందిస్తాయి. ఆ తర్వాత నుంచి ఇన్‌స్టిట్యూట్‌కు నేరుగా పంపుతాయి. అంతకుముందు సంవత్సరంలో సదరు విద్యార్థి అకడెమిక్‌ గా చూపిన ప్రతిభ గురించి సమీక్ష చేస్తున్నాయి. దీని ఆధారంగా మిగతా రుణం చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటున్నాయి.

రీ పేమెంట్‌ హాలిడే ఉంటుంది

ఎడ్యుకేషన్‌ లోన్‌ తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు రీ పేమెంట్‌ హాలిడే పేరుతో వెసులుబాటు కల్పిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసుకున్న సంవత్సరం తర్వాత లేదా ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల పద్ధతిలో రుణం తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఇలా గరిష్టంగా 15 ఏళ్ల వ్యవధిలో ఈఎంఐ విధానంలో రుణం చెల్లించొచ్చు. మహిళా విద్యార్థులకు వడ్డీ రేట్లలో 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు రాయితీ ఇస్తున్నాయి.

మనం పూర్తి అవగాహన ఉండాలి

ఎడ్యుకేషన్‌ లోన్స్‌ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఆయా బ్యాంకుల నిబంధనలు, వడ్డీ రేట్లపై స్పష్టత ఏర్పరచుకోవాలి. దీంతోపాటు రీపేమెంట్‌ విధానం గురించి తెలుసుకోవా­లి. అదేవిధంగా తమకు ప్రవేశం ఖరారు చేసిన ఇన్‌స్టిట్యూట్‌కు ఏఐసీటీఈ, యూజీసీ తదితర నియంత్రణ సంస్థల గుర్తింపు గురించి వాకబుచేయాలి.

దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు

మన పిల్లలు చేరే విద్యాసంస్థ  ప్రవేశ ధ్రువీకరణ పత్రం, అకడమిక్‌ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు; తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ; తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు; బ్యాంకు అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌; నివాస ధ్రువీకరణ; థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ; కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అధీకృత లెటర్స్‌.

మరింత సమాచారం కోసం

ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల మేనేజర్ లను సంప్రదించాలి

విద్యా లక్ష్మి పోర్టల్‌

  • ఎడ్యుకేషన్‌ లోన్స్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. విద్యా లక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో లాగిన్‌ అయి..
  • కామన్‌ ఎడ్యుకేషనల్‌ లోన్‌ అప్లికేషన్‌ ఫామ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను.. ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపిస్తారు. ఆ తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే..
  •  ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు పంపుతాయి. విద్యాలక్ష్మి పోర్టల్‌ విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు, బ్యాంకులకు అనుసంధానకర్త గా ఉంటోంది.

Leave a Comment